![]() |
![]() |

అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ `త్రినయని`. బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా చిత్ర విచిత్రమైన మలుపులు, ట్విస్ట్ లతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత రెండు వారాలుగా రసవత్తర మలుపులతో సాగుతూ ఆకట్టుకుంటోంది. ఇందులోని ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరలు నటించారు.
నయని - విశాల్ వెలికి తీసిన పెట్టెని వల్లభ బ్రేక్ చేస్తాడు. దీంతో అది ఓపెన్ అవుతుంది. ఎస్ ఐ సమక్షంలో ఓపెన్ చేసిన పెట్టెలో కత్తి బయటపడుతుంది. అది చూసి అంతా అవాక్కయితే తిలోత్తమ మాత్రం షాక్ కు గురవుతుంది. ఎందుకంటే అది భూషన్ ని తిలోత్తమ హత్య చేసిన కత్తి కాబట్టి. ఎక్కడ తన నేరం బయటపడుతుందో నని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతుంది. తను ఎందుకంత టెన్షన్ పడుతోందో అర్థం కాక వల్లభ తలతిక్కగా వ్యవహరిస్తాడు. దీంతో తిలోత్తమ వల్లభకు అసలు విషయం చెప్పడంతో షాక్ అవుతాడు.
కట్ చేస్తే నయని, విశాల్ ..తిలోత్తమ ఇంటికి వస్తారు వారితో పాటే కత్తిని తీసుకుని ఎస్. ఐ వేలిముద్రల కోసం తన టీమ్ తో వస్తాడు. దీంతో తిలోత్తమ మరింత భయాందోళనకు గురవుతుంది. వీళ్లెందుకొచ్చారని ఆరాతీస్తుంది. మీ ప్రాంగనంలో కత్తి దొరికింది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ వేలి ముద్రలు కావాలంటాడు ఎస్ ఐ. ఇదే విషయాన్ని నయని చెబుతూనే గాయత్రీ దేవి అమ్మగారి హత్య కేసుని తిరిగి రీఓపెన్ చేయించానని షాకిస్తుంది. వరుసగా కుటుంబ సభ్యులు అంతా వేలి ముద్రలు ఇవ్వడం మొదలు పెడతారు. తిలోత్తమ వంతు వచ్చే సరికి వణకడం మొదలు పెడుతుంది. దీంతో అత్తమ చేతులు వణుకుతున్నాయి. మీరు దగ్గరుండి వేలి ముద్రలు ఇప్పించండి అని విశాల్ తో అంటుంది నయని.. తిలోత్తమ వేలిముద్రలతో దొరికిపోయిందా? ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |